చీరాల వైఎస్సార్ కాంగ్రెసు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణపై ఆ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు ముగిసిన అనంతరం ఆమంచి తన ప్రచారాన్ని కొనసాగించారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఆమంచి వైసీపీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అనుమతి లేదని పోలీసులు ఆమంచికి స్పష్టం చేశారు. దాంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ప్రసాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.