కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం రెండు నెలల్లోనే 36 సార్లు చమురు ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నదని మండిపడ్డారు. చమురు కంపెనీలతో ప్రధాని మోదీ చేతులు కలిపి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని అన్నారు. ఈ ధరల వల్ల రవాణా రంగంలో, నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.25 పెంచిన కేంద్రం నిలువు దోపిడీ చేస్తుందని విమర్శించారు. పెట్రోల్ ధరల మంటల్లో మోదీ ప్రభుత్వం కాలిపోక తప్పదని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
previous post
next post
కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు