telugu navyamedia
రాజకీయ

బుల్లెట్ రైలు మాకు వద్దు..  గుజరాత్ రైతులు

gujarath farmers protest on bullet train
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రైతులు ఆందోళన బాట పట్టడం సంచలనం రేపింది. బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా 14 అభ్యంతరాలను లేవనెత్తిన 29 గ్రామాల రైతులు నిరసన ప్రదర్శన చేసి అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం రెండులక్షల చెట్లను నరకాలని, దీనివల్ల పచ్చదనానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని రైతు నాయకుడు జయేష్ పటేల్ ఆరోపించారు.
బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం తమ పచ్చని పొలాలు ఇవ్వమని 29 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టు బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం పొలాలను సేకరించి 2023లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అహ్మదాబాద్- ముంబయి బుల్లెట్ రైలు, అహ్మదాబాద్- గాంధీనగర్ మెట్రోరైలు ప్రాజెక్టుల కోసం భూములను జపాన్ పార్లమెంటరీ ఉప మంత్రి అకిమోటో మసటోషి పరిశీలించారు. రూ. 3,500 కోట్లతో నిర్మించనున్న ఈ రైలుమార్గం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. మొదటి నుండి మోడీ ఈ ప్రాజెక్ట్ పై పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన సొంత రాష్ట్రంలోనే రైతులు ఇలా వ్యతిరేకత వ్యక్తం చేయడం చూస్తుంటే, బహుశా దేశం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నందువలన దైర్యం చేసి, వాళ్ళు తమ మనసులోనిది ఇప్పటికి వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది.

Related posts