బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్‌రావు నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు బంపర్ బహుమతి ప్రకటించారు. పోలీసుల బర్త్‌డే రోజుకు కమిషనరేట్ నుంచి గ్రీటింగ్‌కార్డు పంపదలిచారు. ఆరోజున పోలీసులకు సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. శనివారం ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీసుకు బర్త్‌డే రోజున సెలవు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులతో సంతోషం గా గడిపేందుకు వీలుండాలని ఉత్తర్వు జారీ చేసినట్టు కమిషనర్ వెల్లడించారు.
ఇదే సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీసులందరికీ మరో శుభవార్త వెల్లడైంది. కొన్నేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న 6వ వేతన కమిషన్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి