telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ స్టార్లపై సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రెయినర్ కిరణ్ డెంబ్లా కామెంట్స్

Dembla

యంగ్ రెబల్ స్టార్‌పై ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రెయినర్ కిరణ్ డెంబ్లా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనే టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ రాక్ స్టార్ అంటూ తనను పిలుస్తుంటాడని చెప్పుకొచ్చారు. “సాహో” సందర్భంగా ప్రభాస్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆయనతో తనకున్న అనుంబంధాన్ని పంచుకున్నారు. రెబల్, బాహుబలి సినిమాలప్పుడు తాను ట్రెయినింగ్ ఇచ్చానని చెప్పారు. ప్రభాస్‌ను ఎప్పుడు కలిసినా.. ఎంతో మర్యాద, గౌరవాన్ని చూపుతాడని తెలిపారు. ఇంటికెళ్లిన ప్రతిసారీ.. ఇంటి బయట వరకు వచ్చి సాగనంపుతారని చెప్పారు. ఇంటికి వెళ్లాక ఫోన్ చెయ్యమని జాగ్రత్తలు చెబుతుంటాడని అన్నారు. తన చేతి వంట అడిగి మరీ రుచి చూశాడని చెప్పారు. ప్రభాస్.. గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పరిచయమవ్వడం నిజంగా తన అదృష్టమన్నారు. “రామ్ చరణ్‌ను కలవడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. మొదట నేను ఉపాసనకు ట్రెయినింగ్ ఇచ్చాను. ఆ తర్వాత చెర్రీతో పరిచయం అయ్యింది. ఇక తమన్నా, అనుష్క, రాజమౌళి, రమా రాజమౌళి, ప్రకాశ్ రాజ్‌లకు ట్రెయినింగ్ ఇచ్చే అవకాశం దక్కింది. ప్రభాస్‌కు బైసప్స్ అంటే ఇష్టం. రన్నింగ్, స్కిప్పింగ్ అంటే రాజమౌళికి ఇష్టం. తమన్నా గురించి చెప్పాలంటే తను నా డార్లింగ్. నాలుగు గంటలకే లేచి వర్కవుట్స్ చేస్తుంటుంది. క్రమశిక్షణ కలిగిన నటి. డైట్ మెయింటెయిన్ చేస్తుంటుంది. చెర్రీ సమయపాలన కచ్చితంగా పాటిస్తారు. జీవితంలో ఓ లక్ష్యమంటూ ఉండాలి. ఏదో ఒకటి చేయాలి. నా లక్ష్య సాధనలో ఎన్నో నేర్చుకున్నాను. 45 ఏళ్ల వయస్సులో నా నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతుంటే చాలా ఆనందంగా ఉంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ ఫిట్‌నెస్ స్టార్లు. హీరోయిన్లలో తమన్నా, తాప్సీ, సమంత ఫిట్‌గా ఉంటారు” అని తెలిపారు.

Related posts