telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్యాస్ట్ గురించి లావణ్య త్రిపాఠి ట్వీట్… వెంటనే డిలీట్

Lavanya-Tripati

ఇటీవ‌ల అఖిల బ్రాహ్మ‌ణ మ‌హాస‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఓం బిర్లా బ్రాహ్మ‌ణ కులానికి అనుకూలంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. “స‌మాజంలో బ్రాహ్మ‌ణుల‌కు ఉన్న‌త‌స్థానం ఉంది. ఇది ఆయ‌న‌ (పరుశురాముడుని ఉద్దేశిస్తూ) త్యాగం, త‌ప్ప‌స్సు కార‌ణంగా ప్రాప్తించింది. ఈ కార‌ణంతో ఎప్పుడూ బ్రాహ్మ‌ణులు స‌మాజంలో మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించే కీల‌క భూమిక‌ను పోషిస్తున్నారు” అంటూ ఓం బిర్లా ట్వీట్ చేశారు. ఓ బాధ్యాత‌మ‌యుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు ఎలా చేస్తారు? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్న త‌రుణంలో..వారికి మ‌ద్ద‌తుగా టాలీవుడ్‌ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కూడా ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. “నేను బ్రాహ్మ‌ణ కులానికి చెందిన వ్య‌క్తిని. అయితే కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు మాత్రం మేం గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో? అర్థం కావ‌డం లేదు. నువ్వు చేసే ప‌నులను అనుస‌రించే నువ్వు గొప్ప‌వాడివి అవుతావు. కానీ నీ కులం వ‌ల్ల కాదు” అంటూ లావ‌ణ్య ట్వీట్ చేశారు. అయితే త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయ‌ని అనుకుందో ఏమో!. ట్వీట్‌ను డిలీజ్ చేసింది లావ‌ణ్య‌.

Lavanya

Related posts