telugu navyamedia
విద్యా వార్తలు

సీబీఎస్సీ టెన్త్‌ టర్మ్‌ 1 ఫలితాలు విడుదల..

సీబీఎస్‌ఈ 10వ తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినట్లు శనివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది..సీబీఎస్సీ 10వ తరగతి 2021-22 సెషన్‌ టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆఫ్‌లైన్‌లో మాత్రమే విడుదల చేశామని, విద్యార్ధులకు సంబంధించిన మార్కు షీట్‌లను వారి వారి స్కూళ్లకు పంపించామని తెలియజేస్తూ బోర్డు ట్వీట్‌ చేసింది.10వ తరగతి థియరీ పేపర్లకు సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్ధులు తమ స్కూళ్లను సంప్రదించాలని సూచించింది.

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో ఇంకా ప్రకటించలేదని, త్వరలో ప్రకటిస్తామని తెల్పింది. ఆన్‌లైన్‌లో ఫలితాలు ప్రకటించిన తర్వాత results.gov.in లేదా digilocker.gov.inలో కూడా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

12 వ తరగతి ఫలితాలను కూడా త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది. కాగా గత ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరిగిన 10, 12 తరగతి టర్మ్ 1 పరీక్షలకు 36 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టర్మ్ 2 పరీక్షలు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహాలో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. కాగా ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది.

ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని.. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక ముందు ఎవరినీ కూడా పాస్ చేయబోమని స్పష్టం చేసింది.

Related posts