telugu navyamedia
విద్యా వార్తలు

బడి పంతులు పంగనామాలు..

విద్యార్థులు విద్యావంతులు కావాలి… ప్రయోజకులు కావాలనే నినాదాలు.. సందేశాలు… వినేందుకు గొప్పగా ఉంటాయి… వాటి అమలు తీరు… ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. ఉపాధ్యాయుల ఉదాసీనత… వెరసి గ్రామీణప్రాంత విద్యార్థుల పాలిటశాపంలా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది.

పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండల తలిశెట్టి బాలుర ఉన్నతపాఠశాల చదువు గాడి తప్పింది. చదువు చెప్పేందుకు టీచర్లు పాఠశాలలో అందుబాటులో ఉండరు. ప్రధానోపాధ్యాయురాలు బాధ్యతారహితంగా వ్యహరించడంతో విద్యార్థు చదువులు చతికిలపడ్డాయి.

అమ్మఒడి, జగనన్నకానుక, జగనన్న గోరుముద్ద ఇక్కడి విద్యార్థులకు తెలియవు. ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితి తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బడి పరిసరాల్లో విద్యార్థులు కూర్చొన్న పరిస్థితులు… చదువులు సాగే తీరుకు అద్దంపడుతున్నాయి.

Related posts