telugu navyamedia
విద్యా వార్తలు

‘బ్రెయిన్  ఫీడ్’ జాతీయ సదస్సుకు విద్యావేత్తలు హాజరు

Brainfeed 6th National Conference Awards 2019
హైదరాబాద్ మాదాపూర్ అవాస హోటల్ లో గురువారం ‘బ్రెయిన్ ఫీడ్’ ఎడ్యుకేషనల్ మ్యాగజైన్ 6వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ విద్యావేత్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  డిల్లీ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ( వైస్ ఛాన్సలర్ ) ప్రొఫెసర్ దేనేష్ సింగ్ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు.  ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కరామయ్య తో పాటు దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి విద్యావేత్తలు హాజరై ఈ సదస్సులో ప్రసంగించారు. 
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి సుమారు 500 విద్యా సంస్థల యాజమాన్యాలు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యా సంస్థల డైరెక్టర్లకు ‘బ్రెయిన్ ఫీడ్’ యజమాన్యం ద్వారా జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో  కీనోట్ స్పీకర్  ఇయాన్  డేవిస్ , టర్కి సెయిబా స్కూల్ వ్యవస్థాపకులు సెయిదా సివేక్ , ఇంటలిజెన్స్ డిఐజి కే వి. శివకుమార్, ప్రొఫెసర్  ఏం. అంజిరెడ్డి , బెంగ్లూర్ కథలయ డైరెక్టర్ గీతారామానుజంతో పాటు విద్యా సంస్థల డైరక్టర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Related posts