తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు రేపటితో అంటే.. నవంబరు 14తో ముగియనుంది. ఈ పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 3677 పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. పదోతరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు.
ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజూ మినహాయింపు ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆన్‌లైన్ ద్వారా 21.11.2019 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.