నేటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ ఎంసెట్-2019 కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయరాజు ఈ ఉదయం పరీక్షాపత్రం కోడ్ విడుదల చేశారు. జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజుతో కలసి మొదటి రోజు ఇంజినీరింగ్ పరీక్ష సెట్ కోడ్ విడుదల చేశారు.
ఉదయం పరీక్ష సెట్ కోడ్ ఈజీ-02, మధ్యాహ్నం పరీక్ష సెట్ కోడ్ ఈజీ-18ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ నెల 23న ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, ఈ నెల 24న వ్యవసాయ, వైద్య విభాగం పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. మే రెండో వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తామని రామలింగరాజు చెప్పారు.
బీజేపీలో చేరడమే సబ్కా వికాస్‌కు అర్థమా?: గల్లా జయదేవ్