telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నేడు 70వ వసంతంలోకి చంద్రబాబు.. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

Happy Birthday The Great Chandrababu Naidu Story
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.  నేడు చంద్రబాబు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు, జాతీయ నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శుభాకాంక్షలు. చిరకాలం ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా” అని పేర్కొన్నారు. 
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
జన్మదినం సందర్భంగా నేడు రోజంతా ఆయన బిజీగా గడపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10: 30 గంటల వరకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులతో గడుపుతారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. .
Happy Birthday The Great Chandrababu Naidu Story
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు  విభజన అనంతరం 2014 ఎన్నికలో  ఏపీ సీఎం గా 5 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన కొనసాగించారు. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణం చేపట్టారు.  మరో వైపు  ప్రత్యక హోదా విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరును జాతీయ స్థాయిలో  ఎండగట్టారు.  ఆర్థిక ఇబ్బందులను అధిగమించి  అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. చంద్రన్న భీమాతో పాటు మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు పసుపు-కుంకుమ  పథకాన్ని ప్రారంభించారు. 
బీజీపీ ప్రభుత్వం ఏపీకీ అన్యాయం చేసిందని ప్రత్యేక హోదా ఇవ్వక పోగా, ఏపీకీ రావాల్సిన నిధులను కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో  జాతీయ రాజకీయాల పై దృష్టి సారించారు. ఇటీవలీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పలువురు జాతీయ నేతలు చంద్రబాబు తరపున ప్రచారం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. అంతే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు కలకత్తాలో విపక్షాలు నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కర్ణాటక , తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు త్వరలో మిగితా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నేడు చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

Related posts