శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు పేలిన ఘటన కలకం రేపింది. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని పాఠశాల వద్ద రెండు నాటుబాంబులు పేలాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు(12), రాజు(11)కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాల ఆవరణలో నాటుబాంబులు పేలడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు.
మీడియాలో ఓ వర్గం చంద్రబాబుకు పల్లకీ సేవ: విజయసాయిరెడ్డి