ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పాలనలో హడావుడి తప్ప అభివృద్ధి జరిగిన దాఖలాలు శూన్యమని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక తమతో జట్టు కట్టడం జరగని పని అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం ముగిశాక ఆగస్టు 19 నుంచి బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కన్నా వెల్లడించారు.కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుందనన్నారు.
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…