telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

రిటైల్‌ స్టోర్లలో… నోకియా 6.2 మూడు కెమెరాల స్మార్ట్ ఫోన్..

nokia 6.2

హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత విపణిలోకి నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను(భారత్‌లో) రూ. 15,999గా సంస్థ నిర్ణయించింది. ఈ ఫోన్ అమెజాన్‌, నోకియా.కామ్‌ వెబ్‌సైట్లలో ఇప్పటికే ఈ మోడల్‌ అందుబాటులో ఉంది. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ స్టోర్లలో ఈ మోడల్‌ అందుబాటులోకి రానుందని సంస్థ ప్రకటించింది. సెరామిక్‌ బ్లాక్‌ వేరియంట్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని.. ఐస్‌ కలర్‌ వేరియంట్‌ను త్వరలో స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తామని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. నవంబరు 30లోపు నోకియా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 1,500 విలువైన గిఫ్ట్‌ వోచర్స్‌, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి రూ. 7,200 విలువ చేసే ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ పేర్కొంది.

నోకియా 6.2 ప్రత్యేకతలు :

* 6.3ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
* 16+8+5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమెరా
* 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
* ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్‌
* గొరిల్లా గ్లాస్‌ 3
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ
* 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Related posts