telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ నిర్ణయం విభజన చట్టానికి విరుద్దం: సీఎం కేసీఆర్‌

KCR cm telangana

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు. వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఫిర్యాదుకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో తెలంగాణను సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదమని కేసీఆర్‌ తెలిపారు.

Related posts