telugu navyamedia
సినిమా వార్తలు

భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ రిలీజ్‌..

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘భీమ్లానాయక్’​ థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆసక్తికర కథాంశం, రానా-పవన్​ల నటన, తమన్​ నేపథ్య సంగీతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బ్లాక్​బస్టర్​ టాక్​తో దూసుకుపోతుంది.

‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటించారు. రానా కీలకపాత్ర పోషించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. స్క్రీన్​ప్లే-మాటలు త్రివిక్రమ్ అందించగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ ను.. మొదట తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కానీ.. టెక్నికల్ కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాస్త వాయిదా పడింది.

తెలుగులో సూపర్​ హిట్​ అయిన భీమ్లా నాయక్​ను హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.దీని కోసమే ఈ సినిమా హిందీ ట్రైలర్​ను కూడా శుక్రవారం విడుదల చేశారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Related posts