telugu navyamedia
సినిమా వార్తలు

శంకర్ డైరెక్షన్ లో చిరంజీవి ?

chiranjeevi on maa schemes

మెగాస్టార్ చిరంజీవి, భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్నారు. చిరంజీవితో ఓ సినిమా చేయాల‌నుంద‌ని శంక‌ర్ కూడా ఇప్ప‌టికే ప‌లుసార్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో శంక‌ర్ కోరిక నెర‌వేర‌బోతున్నట్టు తెలుస్తోంది. శంక‌ర్‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం. శంక‌ర్ ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా “భార‌తీయుడు-2” తెర‌కెక్కిస్తున్నారు. ఇది పూర్త‌యిన త‌ర్వాత చిరంజీవి కోసం క‌థ సిద్ధం చేస్తార‌ట‌. ప్రస్తుతం చిరంజీవి “సైరా” సినిమాతో బిజీగా ఉన్నారు. దీని త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేస్తారు. ఆ సినిమా పూర్త‌యిన త‌ర్వాత శంక‌ర్ సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కూడా శంక‌ర్ త‌ర‌హాలో భారీగానే ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Related posts