సల్మాన్ ఖాన్ కు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నారు. హిందీ తర్వాత అతి పెద్ద మార్కెట్ అయిన తెలుగు సహా తమిళ, కన్నడ భాషల్లోనూ తన సినిమా “దబాంగ్-3″ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సల్మాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దబాంగ్ 3’. 2010లో విడుదలైన “దబాంగ్” ఫ్రాంచైజీలో మూడో పార్ట్ ఇది. ‘వాంటెడ్’ తర్వాత సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ నటిస్తోన్న ఈ చిత్రం తొలిసారి హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదలవుతుందట. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేస్తుందని సమాచారం. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.
సల్మాన్‌కి సన్నిహితుడైన రామ్ చరణ్ తన బ్లాక్ బస్టర్ ఫ్రెండ్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశాడు. “హండ్రెడ్ డేస్ టూ దబాంగ్-3” అనే హ్యాష్ ట్యాగ్ జత చేసి చిత్ర తెలుగు వర్షెన్ మోషన్ పోస్టర్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా షేర్ చేశాడు. వీడియోలో సల్మాన్… ఆటకైన, వేటకైన రెడీ అని చెప్పే డైలాగ్ అభిమానులని అలరిస్తుంది. కిచ్చా సుదీప్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. దబాంగ్ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో “దబాంగ్-3″పై భారీ అంచనాలు ఉన్నాయి.
Mega Power Star #RamCharan about #SalmanKhan‘s #Dabangg3#Dabangg3Xmas2019 #100DaysToDabangg3 pic.twitter.com/VUCSvylwah
— BARaju (@baraju_SuperHit) 11 September 2019