telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మసూద్‌ను గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా గుర్తించాల్సిందే.. ఐరాస లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ప్రతిపాదన!

Ban Jaishe Mohmed Terrarist demand

జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌ పై నిషేదం విదించాలని ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అజార్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా బుధవారం ప్రతిపాదించాయి. ఐరాసలో ఈ మూడు దేశాలకు వీటో అధికారం ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లో అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా గుర్తించాలంటూ భారత్‌ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ విషయంలో ఇప్పుడు భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.

ఇప్పటికే జైషే పై అంతర్జాతీయంగా నిషేధం విధించారు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భద్రతా మండలిలో ప్రతిపాదించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే 2009, 2016లో భారత్‌, 2017లో పీ3 సభ్యదేశాలు ప్రతిపాదించాయి. అయితే చైనా తన వీటో అధికారంతో ప్రతిసారి అడ్డుతగులుతూ వస్తోంది. భారత సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై జరిపిన ఉగ్రదాడికి జైషే బాధ్యత వహించిన నేపథ్యంలో చైనాపై కూడా ఒత్తిడి పెరిగింది.

Related posts