ఆంధ్రప్రదేశ్ కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవికి చంద్రబాబు రాజీనామాతో మంత్రి మండలి, ప్రభుత్వ విప్ హోదాలు రద్దు అయ్యాయి.
దీంతో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేస్తూ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మంది సభ్యులు మే 25 నుంచి ప్రభుత్వ విప్ హోదాలు కోల్పోయారు. పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దా వెంకన్న మండలిలో చీఫ్ విప్ హోదా కోల్పోయారు.