72 ఏళ్ల కొడుకును 92 ఏళ్ల తల్లి అంతమొందించిన దారుణ సంఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. కొడుకు ఆమెను నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తానని చెప్పడమే ఈ దారుణానికి కారణం. గతేడాది వేసవి కాలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. 92 ఏళ్ల అన్నా మే బ్లెస్సింగ్ అనే వృద్ధురాలు ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ తన కుమారుడిని తానే తుపాకీతో కాల్చి చంపినట్లు తెలిపింది. అంతేగాక అదే గన్‌తో కొడుకు ప్రియురాలిని కూడా బెదిరించినట్లు చెప్పింది. తనను నర్సింగ్ హోమ్‌కు వెళ్లాలని చెప్పడంతో అతణ్ణి అంతమొందించినట్లు వివరించింది. ఈ ఏడాది మార్చిలో ఈ హత్యకేసు విచారణకు వచ్చింది. కానీ, బ్లెస్సింగ్ జనవరిలోనే కన్నుమూసింది. అయితే, ఆమెను విచారించిన సమయంలో తీసిన వీడియోను అరిజోనా పోలీస్ అధికారులు తాజాగా విడుదల చేశారు.
next post
నా ప్రకటనలను అతనే నియంత్రించాడు… “గురూజీ” అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు