telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముద్దులొలుకుతున్న అసిన్ కూతురు… ఫోటో వైరల్

Asin

ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి అసిన్. దక్షిణాదిన మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కూడా మంచి హిట్లను అందుకున్న ఈ బ్యూటీ తన గ్గామర్‌తో కుర్రకారు మనసులు దోచుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పుడే అసిన్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకొని సినిమాల‌కి దూర‌మైన విష‌యం తెలిసిందే. అసిన్ వివాహం 2016, జ‌న‌వరి 19న‌ జ‌ర‌గ‌గా, అక్టోబ‌ర్ 25, 2017న ఈ దంప‌తుల‌కి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది.ఆ పాపకి ఆరిన్ పేరు పెట్టారు. ఓనం సంద‌ర్భంగా త‌న కూతురి ఫోటోతో పాటు భ‌ర్త‌తో దిగిన ఫోటోని షేర్ చేసింది అసిన్. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అసిన్ గ‌తంలో త‌న కూతురు సంవ‌త్స‌ర కాలం పూర్తి చేసుకున్న‌ప్పుడు తీసిన‌ ఫోటోల‌ని షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

 

View this post on Instagram

 

#throwback to last year- Arin’s 1st Onam, 10months old👶🏻 #ourlilprincess

A post shared by Asin Thottumkal (@simply.asin) on

Related posts