telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్‌ పట్టాభిషేకానికి డేట్‌ ఫిక్స్‌..?

కేటీఆర్‌ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి తలసాని నిజామాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్‌ను సీఎం చేయాలని తమ డిమాండ్‌ను తెలిపారు. అయితే.. కేటీఆర్‌ సీఎం కాబోతున్నాడంటూ… వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని.. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఇవాళ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ అంటూ పద్మారావు పేర్కొన్నారు. అయితే.. సీఎం మార్పు అతి త్వరలోనే ఉండచ్చని పార్టీలో టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఫిబ్రవరి 18 కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తారని టాక్‌ వస్తోంది. ! కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించాక…. కేసీఆర్‌ కొంత కాలం విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల వైపు అడుగులేసే అవకాశాలున్నాయి. అయితే… జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే యోచనలో భాగంగానే సీఎం కేసీఆర్‌ అడుగులు వేయనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనా దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే.. కేటీఆర్‌ సీఎం అయ్యాక కేబినేట్‌లోనూ సంచలన మార్పులు ఉంటాయని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

Related posts