telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉన్న ఉద్యోగాలు బీజేపీ ఊడగొడుతుంది : మంత్రి హరీష్ రావు

Harish Rao TRS

చేర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ వాళ్లు నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. మీరు మాట్లాడితే ఇక్కడ కాదు… చేతనయితే ఢిల్లీలో మాట్లాడాలని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలు బీజేపీ ఊడగొడుతుందని.. ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది తెరాస ప్రభుత్వమని స్పష్టం చేశారు. బీఎస్ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారని…ఉద్యోగాలు ఊడగొట్టినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. గ్యాస్ ధర, పెట్రోల్ డిజీల్ ధర పెంచడానికి బీజేపీ ఓటు వేయాలా…లేక పెట్రోల్ వంద రూపాయలు చేసినందుకు ఓటు వేయాలా అని నిలదీశారు మంత్రి హరీష్‌. ఇప్పుడు ఎరువుల ధర కూడా పెంచుతారంట.. యాసంగికి ఎరువుల ధర పెరగనుందని తెలిపారు. బీజేపీ చేసిందేమి లేదు.. మనకు రావాల్సింది కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ 14.2 శాతం వృద్ధి రేటుతో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందని…అప్పులు అతి తక్కువ తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఉద్యమంలో పళ్లా రాజేశ్వర్ రెడ్డి జైలుకు వెళ్లారని.. తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. ఉద్యమ కారుల పక్షాన నిలబడి దెబ్బలు తిన్న మనిషి పళ్లా అని తెలిపారు.

Related posts