telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ప్లేస్టోర్ కు ప్రత్యామ్నాయం… గూగుల్, యాపిల్ లకు షాక్

Phone

గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో ఒక యాప్ స్టోర్‌ను రూపొందించడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ సేవ యాప్ స్టోర్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు మనదేశంలో విక్రయించే ఫోన్లలో ఇండియన్ యాప్ స్టోర్‌ను కూడా ముందుగానే ఇన్ స్టాల్ చేయాలని గూగుల్, యాపిల్‌లను కేంద్రప్రభుత్వం కోరనుందని సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ సేవ యాప్ స్టోర్‌ను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ మాత్రమే అందుబాటులో ఉన్న యాప్ స్టోర్లు. వీటికి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఇటువంటి స్టోర్‌ను రూపొందించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ కొత్త యాప్ స్టోర్‌ను సీ-డాక్ రూపొందిస్తుందని, సురక్షితమైన పేమెంట్ సేవలను అందించడానికి ఎన్‌పీసీఐ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఉంచే యాప్స్ నుంచి 30 శాతం రుసుముని అవి వసూలు చేస్తాయి. అయితే భారతీయ యాప్ స్టోర్ ఈ చార్జీలను విధించబోవడం లేదని సమాచారం. ప్రస్తుతం మనదేశ మార్కెట్లో యాప్ స్టోర్ షేర్ 97 శాతంగా ఉంది. దీనికి బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు భారతీయ సార్ట్-అప్ కంపెనీలను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటోంది. తమ యాప్‌లను పబ్లిష్ చేసినందుకు గూగుల్, యాపిల్ రుసుం వసూలు చేస్తున్నాయని భారతీయ స్టార్టప్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. కచ్చితంగా తమ బిల్లింగ్ వ్యవస్థనే ఉపయోగించాలని కంపెనీలు తమను బలవంతపెట్టకూడదని అవి చెబుతున్నాయి.

Related posts