telugu navyamedia
రాజకీయ

‘జడ్‌’ కేటగిరి భద్రతను తిరస్కరించిన ఓవైసీ..

యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పుల ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌లు ముందు కాల్పులు జ‌ర‌ప‌డం వెన‌క ఎవ‌రు ఉన్నారంటూ చ‌ర్చానీయాంశం అయ్యింది.

దీంతో ఓవైసీకి జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సిఆర్‌పిఎఫ్‌ యొక్క ‘Z’ కేటగిరీ భద్రతను తక్షణమే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. 

అయితే ..తనకు జెడ్ కేటగిరి భద్రత వద్దని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ‘ఎ’ కేటగిరీ పౌరుడిగా స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని చెప్పారు. నాకు చావంటే భయం లేదు. నాకు ప్రజలే రక్షకులు.  

కాల్పులు జ‌రిపిన వారిని శిక్షించ‌కుంటే అతివాద తీవ్ర‌వాదం కూడా పెరుగుతందన్నారు. భార‌త్ చాలా గొప్ప దేశ‌మ‌ని, ఈ దేశ సంప‌ద ప్రేమే అని, ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో ప్రేమ ఉంటే చాల‌న్నారు. త‌న‌ గొంతును నొక్కేందుకు తూటాలు పేల్చాల్సిన అవ‌స‌రం ఏమి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇలా జరిగినంత మాత్రాన.. తన ట్రాక్​ నుంచి పక్కకు తప్పుకోనని, ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలే బ్యాలెట్​ ద్వారా వారికి తగిన సమాధానం చెప్తారని అన్నారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా సోమవారం పార్లమెంటులో సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.

Related posts