telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-5లోకి బోల్డ్ బ్యూటీ మ‌రోసారి..?

డేర్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ తో బిగ్ బాస్ 4లో బోల్డ్ బేబీగా బ్రాండ్ ఏర్పడ్డ అరియానా ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ 5లోను అసోసియేట్ అవ్వబోతుంది. బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ నుండి బయటికొచ్చిన తరువాత మ‌రింత క్రేజ్ సంపాదించింది. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మతో వర్కౌట్స్ చేస్తూ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. ఈ సారి మ‌రో క్రేజీ ఆఫర్ కొట్టేసింది అరియానా.

Bigg Boss Telugu 4 Finale: Ariyana Glory Leads The Voting List? - Filmibeat

కాగా.. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.నాగార్జున హోస్టుగా నిన్న అట్టహాసంగా 19మంది కంటెస్టెంట్స్ తో కావాల్సనంత గ్లామర్ తో బిగ్ బాస్ హౌస్ కళకళ లాడుతుంది. ఇక ఈ 19మందిలో వారానికి ఒకరు చొప్పున హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంటారు. అలా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ సెట్ లోనే ఇంటర్వ్యూ చేయటం ఆనవాయితీ. హౌస్ లో వారి అనుభూతి, అనుభవాలను బిగ్ బాస్ బజ్ లో పంచుకుంటారు. బిగ్ బాస్-4 బజ్ కి యాంకర్ గా రాహుల్ సిప్లిగంజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ 5 బజ్ కి అరియానా యాంకరింగ్ చేయనుంది.

Ariyana In Mega Hero Film

ఇక తాజాగా అరియానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-5 బజ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కావాల్సిన వాళ్లకి కావాల్సినంత.. చూసేవాళ్ళకి చూసేంత ఎంటర్టైన్మెంట్ అంటూ అరియానా ప్రోమోలో రచ్చ చేస్తుంది.

Related posts