telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ పెళ్ళికి ముహూర్తం ఖరారు… విశాల్ కు హైకోర్టు షాక్

Vishal to marry Hyderabad girl Anisha soon

త్వరలోనే హీరో విశాల్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ యువ హీరో హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపారి కుమార్తె అనీషా రెడ్డి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఇటీవ‌ల నిశ్చితార్థం కూడా జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం వీరి పెళ్లికి పెద్దలు తేదిని నిర్ణ‌యించార‌ట‌. వివ‌రాల ప్ర‌కారం అక్టోబ‌ర్ 9న వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. మ‌రి పెళ్లి విశాల్ చెప్పిన‌ట్లు న‌డిగ‌ర్ సంఘం భ‌వ‌నంలో జ‌రుగుతుందా? లేక హైద‌రాబాద్‌లో జ‌రుగుతుందా? అనే తెలియ‌డం లేదు. వేదిక‌పై కూడా త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్నారు.

మరోవైపు నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా… ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్ ని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. దీంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విశాల్. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది. మండలి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్ కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తులు భారతీరాజా, కే.రాజన్, టీజే.త్యాగరాజన్ లతో కలిపి తొమ్మిది మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకించిన విశాల్ మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే హైకోర్టు విశాల్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. శుక్రవారం నాడు ఈ పిటిషన్ ని విచారించిన న్యాయస్థానం అడహాక్ కమిటీని రద్దు చేయడం కుదరదని చెప్పింది. అయితే అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని వెల్లడించింది.

Related posts