telugu navyamedia
సినిమా వార్తలు

రైతుపొందే ఆనందాన్ని తెలిపిన చిరంజీవి

ఒక రైతు త‌న‌ పంట చేతికి వచ్చిన‌ త‌రువాత దాన్ని కొసికొని ఇంటికి వెళ్లిన‌ త‌రువాత ఎంత ఆనంద ప‌డ‌తాడో అంత ఆనందంగా ఉందంటూ మెగా స్టార్ చిరంజీవి వెల్ల‌డించారు.ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి… రైతు సంతోషాన్ని ఆస్వాదించారు.

డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం జరుపుకున్నాం.. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి రైతన్నకు తనదైన శైలిలో శుభాకాంక్షలను చెప్పారు.

కొన్ని నెలల క్రితం ఇంటి పెరడులో పాతిన ఆనప విత్తనాలతో.. ఓ పెద్ద పాదు పాకి..దానికి రెండు పెద్ద ఆనపకాయలు కాశాయి. వాటిని కోస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

అంతేకాదు.. ప్రకృతి ఎంత గొప్పది అంటే.. మన సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే… అది మనకు కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది. దానికి ఎంత మంది కృతజ్ఞతగా ఉన్నామ‌నేది నా ఉద్దేశం అని తెలిపారు.

మీరు కూడా ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి…మ‌నం బ‌జారులో కొనే తెచ్చిన దానికంటే స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు .

 

Related posts