telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం : వైఎస్ఆర్ కాపు నేస్తం నిధుల విడుదల చేసిన జగన్

వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల..

కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం
చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్తుడు రాజకీయం కావాలా..
కాపు ఓట్ల‌న్నీ చంద్ర‌బాబుకు అమ్మేయాలని చూస్తున్నాడు

వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాపులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. 

మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తున్నట్లు సీఎం అన్నారు. కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 3క్షల మందికి పైగా మహిళలకు 490 కోట్లు ఇచ్చామని.. 3,27,244 మందికి మరో రూ.490 కోట్లు ఇచ్చామని జగన్ చెప్పారు. ఒక్కరు కూడా పథకం అందకుండా మిగిలిపోకూడదనే తపనతో అడుగులు ముందుకు వేస్తున్నామని జగన్ అన్నారు. వరుసగా మూడో ఏడాది 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్.

గతంలో అధికార పార్టీ నేతలు చెప్పినవారికే సంక్షేమ పథకాలు అందేవన్నారు. కానీ తమ ప్రభుత్వం కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ గుర్తుచేశారు. 

కాపులకు నేస్తం మాత్రమే కాదని.. చేతల ద్వారా వారికి కాపు కాస్తామన్న విషయాన్ని స్పష్టంగా చూపించామని సీఎం జగన్ అన్నారు.

పారదర్శకతతో ఈ ప్రభుత్వం పథకాలను అందరికీ దక్కేలా చూస్తుందన్నారు.  ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం, మనది రైతు ప్రభుత్వం, మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం, మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నాఅని జ‌గ‌న్ అన్నారు.

Related posts