telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎన్టీఆర్‌ పేరు చెబితేనే చంద్ర‌బాబుకు వణుకు పుడుతుంది..-మంత్రి రోజా

*ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్ర‌బాబుకు న‌చ్చ‌దు..
*ఎన్టీఆర్ పేరు వింటే ఆయ‌న‌కు వ‌ణుకు పుడుతుంది..

*జూ.ఎన్టీఆర్ కు కూడా చంద్ర‌బాబు భ‌యప‌డ‌తారు
*అందుకే ఎన్టీఆర్ ని పార్టీ నుంచి బ‌య‌ట‌కు త‌రిమేశారు..
*చంద్ర‌బాబు 14 ఏళ్ళ‌లో చేయ‌లేని సంక్షేమాన్ని జ‌గ‌న్ 3 ఏళ్ళ‌లో చేశారు..
*అధికారం కోసం చంద్ర‌బాబు ఏమైనా చేస్తారు..

ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్ర‌బాబుకు న‌చ్చ‌దని, ఆ పేరు వింటే ఆయ‌న‌కు వ‌ణుకు పుడుతుంద‌ని. ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. జూ.ఎన్టీఆర్ కు కూడా చంద్ర‌బాబు భ‌య‌ప‌డ‌తార‌ని, అందుకే ఆయ‌న్నిపార్టీ నుంచి బ‌య‌కు పంపించేశార‌ని విమ‌ర్శించారు.

శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని ఇదే విషయాన్ని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ కూడా అన్నార‌ని ఆమె విమర్శించారు.

ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్న‌ చంద్రబాబు ఎంత ఘనుడో ప్రజలకే తెలుసు అని అన్నారు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు .ఎన్టీఆర్ బ్ర‌తికుంటే చంద్ర‌బాబు ప‌రిస్థితి ఎంటో అంద‌రికి తెలుస‌ని అన్నారు.

చంద్ర‌బాబు 14 ఏళ్ళ‌లో చేయ‌లేని సంక్షేమాన్ని జ‌గ‌న్ 3 ఏళ్ళ‌లో చేసి చూపించార‌ని అన్నారు.  చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, తన పుత్రుడు ముద్దపప్పు ఎందుకు పనికి రాడని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నారని రోజా అన్నారు.

మహానాడు అని పెట్టి మహిళలతో నీచాతి నీచంగా మమ్మల్ని తిట్టిస్తున్న ఘటనలు చూస్తున్నామని అన్నారు.

ఇటీవల మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి అమానుషమని రోజా ఖండించారు. అంబేద్క‌ర్ పేరు పెడితే ద‌ళిత‌మంత్రి, బిసిఎమ్మెల్యే ఇళ్ల‌ను టీడీపీ , జ‌న‌సేన నాయ‌కులు కాల్చివేశార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

 

 

Related posts