telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రూ.2,29 కోట్లతో ఏపీ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే ?

ఏపీ అసెంబ్లీ లో ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-21 ఏడాదికి గాను వార్షిక బ‌డ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. ఇందులో వెనక బడిన కులాలకు 32 శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం..
కేటాయింపులు :

మైనారిటీ యాక్ష‌న్ ప్లాన్‌కు రూ.3,840 కోట్లు
చిన్నారుల కోసం బ‌డ్జెట్‌లో రూ.16,748 కోట్లు
మ‌హిళ‌ల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌కు రూ.11,210 కోట్లు
విద్యా ప‌థ‌కాల‌కు రూ.24,624 కోట్లు కేటాయింపు
ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.359 కోట్లు
ఎస్సీ స‌బ్ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
ఎస్టీ స‌బ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ. 1049 కోట్లు
స్కూళ్ల ఆధునీక‌ర‌ణ‌కు రూ.3948 కోట్లు
జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ. 4879.30 కోట్లు
అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ. 13,022 కోట్లు కేటాయింపు.
రూ.1600కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరుముద్ద‌
విద్యాశాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714కోట్లు కేటాయింపు.

Related posts