telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాపు ఓట్ల‌న్నీచంద్ర‌బాబుకు దత్తపుత్రుడు అమ్మేయాలని చూస్తున్నాడు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్ మ‌రోసారి చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు.కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  హోల్ సేల్ గా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

గొల్లప్రోలులో వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద లబ్దిదారులకు వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ..చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పాలనకు , తమ పాలనకు తేడాను గమనించాలని సీఎం జగన్ కోరారు.

గతంలో అధికార పార్టీ నేతలు చెప్పినవారికే సంక్షేమ పథకాలు అందేవన్నారు. కానీ తమ ప్రభుత్వం కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ ఈ ప్రభుత్వం పథకాలను అందచేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో స్కీమ్ ద్వారా పథకాలు అందేవని అన్నారు. దుష్టచతుష్టయం ఈ స్కీమ్ ను అమలు చేసేవారన్నారు. అప్పటికీ ఇప్పటికీ మార్పును చూడాలని జగన్ కోరారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా అందరికీ సాయం అందుతుందన్నారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్దతిలో నేరుగా లబ్దిదారులకే సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న డీబీటీ పథకం కావాలో, డీపీటీ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

వందల సామాజిక వర్గాలు బాగు పడాలా, చంద్రబాబు, దుష్టచతుష్టయంతో పాటు దత్తపుత్రుడు బాగుపడే పాలన కావాలా?లేదా అన్ని సామాజికవర్గాలు లబ్ది చేసే ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోవాలని జగన్ ప్రజలను కోరారు.

తాము ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేసినట్టుగా జగన్ గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికల మేనిఫెస్టో ను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టకు పరిమితం చేశాడన్నారు

చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని జగన్ అన్నారు. కాపుల ఓట్లను కొంత మూటగట్టి హోెల్‌సేల్ గా మూటగట్టి చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు కనిపిస్తున్నాయని అన్నారు. గతంలో ఉన్న బడ్జెట్ ఇదేనని, కానీ అప్పుడు పేదలకు ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయాడో ఆలోచించమని కోరుతున్నానని అన్నారు.

 

 

Related posts