telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పాన్ డబ్బా కొనుక్కునే డబ్బులు లేని నానికి.. అంత డబ్బు ఎక్కడిది…

గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతుంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేత‌ల‌ల మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతుంది. ఒకరిపై ఒకరూ తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి

తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మరోసారి అధికార పార్టీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు.మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నానికి పాన్ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవని.. అలాంటి నానికి అంత డబ్బు ఎక్కడిది, పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఎలా కట్టగలిగారు..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

కొడాలి నానిపై ఫిర్యాదు చేస్తే అఫిడవిట్ ఇవ్వలేదని.. గుడివాడ ఏమన్నా పాకిస్తానా..? ఎవ్వరూ గుడివాడ వెళ్లకూడదా..? మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? ఓరేయ్ పిచ్చి కుక్క… చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడితే మేమూ మాట్లాడతాం అంటూ బుద్ధా విరుచుకుపడ్డారు.

డబ్బు పిచ్చి, పదవి పిచ్చి పట్టిన కొడాలి నాని.. సీఎం వైఎస్ జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారన్నారు.

మంత్రి కొడాలి చేసే కామెంట్లను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అసహ్యించుకుంటారు. 1991లో నెలకు రూ.1.15లక్షల అద్దె కట్టి నేను కొబ్బరికాయల వ్యాపారం చేశా. ఆ సమయంలో కొడాలినాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని బుద్ధా అన్నారు. చంద్రబాబుకి, కొడాలినానికి ఒకేసారి కరోనా వస్తే…, ఉండవల్లిలోని తన నివాసంలోనే హోం ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు. కరోనా సోకగానే చికిత్స కోసం పక్కరాష్ట్రంలో ఆస్పత్రికి పారిపోయిన కొడాలి నాని చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

పాన్ మసాలాలు నమిలి నమిలి నోటి క్యాన్సర్ తెచ్చుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మద పిచ్చి, డబ్బు పిచ్చి పదవి పిచ్చి పట్టిన కొడాలినాని జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. అలాంటి కొడాలినానికి అతడి భాషలోనే సమాధానం చెబుతామంటూ బుద్ధా వెంకన్న అన్నారు.

కొడాలినాని మనిషి కాదు, ఓ పిచ్చి కుక్క.. కుక్కను నియంత్రించాలంటే మేం గర్జించాలంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని మోసగించాడనే కేసులున్న కొడాలి నానినే పెద్ద 420.. కొడాలినాని చంద్రబాబు పై విమర్శలు మానే వరకు నేను మానను అంటూ బుద్దా వెంకన్న అన్నారు.

తనపై కేసు నమోదు చేసి విచారించినట్టే కొడాలి నానిపైనా కేసు నమోదు చేసి విచారించాలని బుద్ధా డిమాండ్ చేశారు. అంతేకాకుండా . కొడాలి నానిని పార్టీ నుంచి పంపిస్తే మీ పార్టీకున్న దరిద్రం పోతుందని కోరారు.

Related posts