telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం : మరో ఉద్యోగిని మృతి

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. ఇందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35,922 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 22 మంది మృతి చెందారు. ఇది ఇలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు వణుకుతున్నారు. తాజాగా ఏపీ సచివాలయానికి చెందిన మరో ఉద్యోగిని కరోనాతో మృతి చెందారు. గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మృత్యువాత పడటం అందరిలో కలవరం రేపుతోంది.పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న శాంత కుమారి ఇవాళ ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం శాంత కుమారి భర్త సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా విలయం సృష్టించడంతో.. వర్క్ ఫ్రమ్ హోంకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.

Related posts