telugu navyamedia
వార్తలు సామాజిక

వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆక్స్ ఫర్డ్ మరో విజయం!

corona vaccine India

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. టీకాను తీసుకొచ్చే క్రమంలో అనేక ప్రయోగాలు చేస్తోంది. ‘సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19’ అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేసింది.

కోతుల్లో టీకా పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలించారు.ఆరు కోతులకు పరిశోధకులు దీన్ని ఇచ్చి 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్‌ కారణంగా వచ్చే న్యుమోనియాను ఈ టీకా‌ నిలువరించగలిగినట్లు తేల్చారు.

కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేసుకోగలిగాయని చెప్పారు. కోతుల్లో వైరల్‌ లోడును తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో తాము అభివృద్ధి చేసిన టీకా ఉపయోగపడుతుందని ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది.

Related posts