telugu navyamedia
సినిమా వార్తలు

ఇప్పట్లో నందులకు మోక్షం లేదు

Andhra Pradesh,Nandhi Awards For This Year
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులకు తాత్కాలికంగా మంగళం పాడినట్టే. చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం నంది అవార్డులను తాము ఇస్తామని ప్రకటించింది. .2012, 2013 , 2014, 2015, 2016, సంవత్సరాలకు  కమిటీలను వేసి అవార్డు  విజేతలను కూడా కటించారు . 2012, 2013 ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ లోకి నిర్మించిన సినిమాలు కానీ తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ నుంచి మాత్రమే అవార్డులు ఇస్తామని ప్రకటించింది .
ఆ రెండు సంవత్సరాలకు  నిర్మాతలు అవార్డుల కోసం అప్లై చేసుకున్నాడు . కనీసం తెలంగాణ ప్రభుత్వం  కమిటీలు కూడా వెయ్యలేదు . ఈ విషయంలో ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు ను కానీ , తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ  అధ్యక్షుడు రామ మోహన్ రావు ను అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు . 
మొదటి నుంచి సినిమా రంగంతో వున్న అనుబంధంతో చంద్రబాబు నాయుడు  2012 నుంచి 2016 వరకు  అవార్డుల కమిటీలు వేశారు  . ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది . ఈ అవార్డులు పక్షపాతంగా వున్నాయనే విమర్శలు వచ్చాయి. టీవీ చానెల్స్ లో నందుల గురించి రచ్చ చేశారు . దీంతో చంద్ర బాబు నాయుడు నంది  అవార్డుల పేరెత్తితే మండిపోవడం మొదలు పెట్టాడు . 
ఎప్పటికప్పుడు నంది అవార్డుల కార్యక్రమం ఉంటుందని విజేతలు ఆశాభావముతో వున్నారు . సినిమాతో పాటు టీవీ   నంది అవార్డులు కూడా 2014, 2015, 2016 సంవత్సరాలకు ప్రదానం చెయ్యాలి . వాటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు . ఇప్పుడు ఎలక్షన్ కోడ్  అమలులోకి వచ్చింది కాబట్టి ఇక నందుల కార్యక్రమం ఉండదు . 
ఇదే  విషయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్ధ  అధ్యక్షులు అంబికా కృష్ణ ప్రస్తావించినప్పుడు , ” వచ్చేది మళ్ళీ తెలుగు దేశం  ప్రభుత్వమేగా , అప్పుడు ఇస్తాం ” అని హామీ ఇచ్చాడు . 

Related posts