telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చిత్ర సీమలో మరో విషాదం… బి.ఎ.రాజు మృతి

టాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా PRO గా కొనసాగుతూ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన బిఎ రాజు మృతి చెందాడు. నిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా బిఎ రాజు తుది శ్వాస విడిచారు. బిఎ రాజు చిత్ర పరిశ్రమలో చాలా మందికి మంచి మిత్రుడు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ప్రతి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చూసుకుంటూ చాలా మంచి గుర్తింపు అందుకున్నారు. కేవలం వారితోనే కాకుండా చాలా మంది దర్శక నిర్మాతలతో అలాగే స్టార్ నటీనటులతో ఆయన ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. చాలా సంవత్సరాలుగా సినీ ప్రేమికులను అలరించిన సూపర్‌హిట్ మ్యాగజైన్‌కు బీఏ రాజు యజమాని కూడా. దర్శకురాలిగా, ఫిల్మ్ జర్నలిస్టుగా ఉన్న ఆయన భార్య బి జయ కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు. ఇక ఇప్పుడు బిఎ రాజు మరణ వార్తతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. అలాగే బీఏ రాజు మృతి పట్ల స్టార్స్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.

Related posts