telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయ కొత్త లుక్… పిక్ వైరల్

Anasuya

యాంకర్ అనసూయ భరద్వాజ్ తిరిగి మళ్లీ ‘జబర్దస్త్’ సెట్స్‌లో సందడి చేస్తున్నారు. బుధవారం (జూన్ 17) నుంచి అనసూయ ‘జబర్దస్త్’ షూటింగ్‌ను షురూ చేశారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘జబర్దస్త్’ వేదికపై పూల గౌనుతో అమితానందం పొందుతూ తీసుకున్న వీడియోను జిఫ్ రూపంలో అభిమానుల ముందు ఉంచారు. అయితే, ఈరోజు అనసూయ తన కొత్త లుక్‌తో అభిమానులను, తన సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యపరిచారు. గురువారం అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అనసూయ లుక్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఆమెను ఇలా ఎవరూ చూసుండరు. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. భుజాల వరకు జుట్టును కట్ చేసి, దానిని ఉంగరాలు తిప్పి, బ్రౌన్ కలర్ వేశారు. హెయిర్ స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా లిప్ స్టిక్ కూడా వేశారు. దీంతో అనసూయ ఇంగ్లిష్ అమ్మాయిలా కనిపిస్తున్నారు. అయితే, ఈ లుక్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Related posts