telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారంటే ఇదే మరి… భార్యను చంపడానికెళ్ళి ఇలా…!?

Florida

హెన్రీ హెర్బిగ్ (65) అనే వ్యక్తి భార్యతో విడాకులు తీసుకుని ఫ్లోరిడాలోని పేస్ ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడి భార్య వర్జీనియా బీచ్ ప్రాంతంలో నివసిస్తోంది. ఆమెను చంపాలని ఎన్నో రోజుల నుంచి పక్కా ప్రణాళికతో సిద్దమైన హెన్రీ సెప్టెంబరు 8వ తేదీన భార్య ఇంటికి వెళ్లాడు. ఫోన్ తీసుకెళ్తే జీపీఎస్ ద్వారా దొరికిపోతానని, ఏటీఎం కార్డు వాడినా పోలీసులు కనిపెట్టేస్తారని తెలివిగా అవేం వెంట లేకుండా తుపాకీ, క్యాష్‌తో భార్య ఇంటికి బయల్దేరాడు. తనను గుర్తుపట్టకుండా నెత్తిపై విగ్ కూడా పెట్టాడు. భార్య ఉంటున్న ఇంటి లోపలకు తుపాకీతో వెళ్లగా.. కట్టేసి ఉన్న కుక్కను వదలడానికి కూతురు ప్రయత్నించింది. అదే సమయంలో కూతురు తలపై రెంచ్ పెట్టి గట్టిగా కొట్టడంతో ఆమెకు గాయమైంది. అనంతరం భార్యను చంపేందుకు ప్రయత్నించగా.. కూతురు దగ్గర్లో ఉన్న తుపాకీ తీసుకుని హెన్రీని కాల్చేసింది. వెన్నెముక దగ్గర బుల్లెట్ తగలడంతో హెన్రీకి అక్కడికక్కడే పక్షవాతం వచ్చేసింది. భార్య, కూతురు అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం హెన్రీని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో మెరుగుపడిన తరువాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్లనున్నారు. 

Related posts