telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైభవంగా కత్రినా కైఫ్ వివాహం… హాజరైన నాగ్, ప్రభు, శివరాజకుమార్

Kathrina

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగగా… మూడు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నాగార్జున, ప్రభు, శివరాజకుమార్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆ ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. కత్రినావివాహం ఎప్పుడు జరిగింది అని షాక్ అవుతున్నారా ? ఓ నగల దుకాణం ప్రమోషన్ కోసం తీసిన యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా నటించింది. ఆ యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా, అమితాబ్, జయా బచ్చన్ ఆమె తల్లిదండ్రులుగా, నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులుగా నటించారు. ఆ యాడ్‌కు సంబంధించిన ఫొటోను అమితాబ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. “జయకు, నాకు ఇది మర్చిపోలేని సందర్భం. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు లెజెండరీ నటుల సూపర్‌స్టార్ కుమారులతో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ పరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి నటించాము” అని అమితాబ్ పేర్కొన్నారు.

Related posts