telugu navyamedia
సినిమా వార్తలు

అక్కినేని హీరో కొత్త సినిమాకు రంగం సిద్ధం

Sumanth

ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి సుమంత్‌ హీరోగా ఓ భారీ చిత్రం మొదలు పెడుతున్నారు. సుమంత్‌ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్‌తో చూపించనున్నారు. సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామాను సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకలపై పి. జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ సరసన సిమ్రత్ నటిస్తుండగా… ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డవారు కాదు. ఎవరూ మంచివారు కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు’’ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంజన ప్రొడక్షన్స్ అధినేత పి.జగన్ మోహన్ రావు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్.

Related posts