telugu navyamedia
సినిమా వార్తలు

షాకింగ్ : కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కు బ్రేకులు

kaushal

బిగ్ బాస్-2 విజేత కౌశల్ తన అభిమానులతో కలిసి “కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భావించాడు కౌశల్. అయితే ఈ ఫౌండేషన్ కు సంబంధించిన డబ్బులను కౌశల్ దుర్వినియోగం చేస్తున్నాడంటూ కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశల్ మీడియా ముందుకు వచ్చి ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పినా విమర్శలు ఏమాత్రం తగ్గడంలేదు. పైగా రోజురోజుకూ ఈ వివాదం పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు కౌశల్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఫౌండేషన్ ను కొన్నిరోజులు నిలిపివేసి, ఆ తరువాత ఫౌండేషన్ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకుని ఎంపిక చేస్తానని, ఇప్పటికి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కమిటీలను రద్దు చేస్తున్నానని ఈ పోస్ట్ ద్వారా కౌశల్ ప్రకటించాడు.

Related posts