telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

మహిళా సాధికారత.. ! దొంగనోట్ల ముద్రణతో స్వయం ఉపాధి.. !!

fake university by a tamilian

ఎంత సంపాదించినా చాలని సంపాదన.. దీనితో రోజు అప్పులతోనే గడుపుతూ.. ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. దీనితో తప్పుడు దార్లు తొక్కటం తప్పని పరిస్థితి అయిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న మహిళ తనకు తాను తెచ్చుకున్న తిప్పలు ఇలా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, దొంగనోట్లు ముద్రించాలనే ఆలోచన చేసింది ఆమె. అనుకున్నదే తడవు ఓ ప్రింటర్ ను కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఇలా లక్షల్లో దొంగ నోట్లను ముద్రించింది. అయితే ఓ షాపు యజమానికి అనుమానం రావడంతో పోలీసులకు దొరికిపోయింది. దీనితో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కటకటాల వెనక్కు నెట్టారు.

ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటుచేసుకుంది. కడలూరులోని మారియప్ప నగర్ కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తిచేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఇంటివద్దే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా ఆమె చుట్టుపక్కల అప్పులు చేసింది. వాటిని తీర్చలేకపోవడంతో దొంగనోట్లను ముద్రించాలని నిర్ణయానికి వచ్చింది. యూట్యూబ్ లో ఇందుకు సంబంధించిన వీడియోలను చూసిన కుమారి.. ఓ ప్రింటర్ ను కొనుగోలు చేసింది. అనంతరం లక్షల్లో దొంగనోట్లను ముద్రించి కడలూరులో మారుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న కడలూరులోని ఓ షాపుకు వెళ్లిన కుమారి.. కొన్ని వస్తువులను కొనుగోలు చేసి రూ.2 వేల నోటును ఇచ్చింది.

తాను ఇచ్చింది దొంగనోటని షాపు యజమానికి అనుమానం రావడంతో అక్కడి నుంచి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చిదంబరం ప్రాంతానికి వెళ్లే బస్సులో ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను ఈ నేరానికి పాల్పడినట్లు కుమారి విచారణలో అంగీకరించింది. దీనితో ఆమెను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Related posts