telugu navyamedia
సినిమా వార్తలు

కత్రినా నన్ను వదిలేసింది… సల్మాన్ వ్యాఖ్యలు

Salman-Khan-and-Katrina-Kaif

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా “భారత్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ జంటకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. పైగా ఒకప్పుడు ఇద్దరూ ప్రేమించుకున్నారని టాక్. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ కామెడీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్రినా ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటనే విషయంపై చర్చ నడిచింది. 2009లో “దే దనా దన్” సినిమా చిత్రీకరణ సమయంలో కత్రినా స్మూతీలు తినడం మానేశారని కత్రినా ఫిట్ నేస ట్రైనర్ అర్చనా పురాన్ సింగ్ వెల్లడించారు. అవి తినడం మానేసిన తరువాత ఆమె మరింత ఫిట్ గా తయారయ్యారని అన్నారు. ఈ మాట విన్న సల్మాన్ వెంటనే “ఆ సినిమా సమయంలో కత్రినా స్మూతీలనే కాదు నన్ను కూడా వదిలేసింది ” అన్నారు. “దే దనా దన్” సినిమా విడుదలైన ఏడాదిలోనే కత్రినా, రణబీర్ తో ఓ సినిమా చేసింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు రావడం గమనార్హం.

Related posts