telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న సీనియర్ నటుడు

AA19

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు “అల‌క‌నంద‌” అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వాళ్లు ప్లాన్ చేసినంత వేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడం లేదు. అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పుడు ఇదే సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ లేట్ కారణంగా సినిమా నుంచి స్టార్ యాక్టర్ రావు రమేష్ తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఈయన్ని బల్క్ డేట్స్ అడిగాడని.. దానికి ఓకే చెప్పి నెల రోజులకు పైగా తన డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే రావు రమేష్ ఇచ్చిన డేట్స్‌ను త్రివిక్రమ్ గ్యాంగ్ సరిగ్గా యూజ్ చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అనివార్య కారణాలతో ఈ సినిమా షూట్ ఆలస్యం కావడంతో రావు రమేష్ డేట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి. ఇదే సమయంలో ఆయన మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమాను కూడా ఒప్పుకున్నాడు. అక్కడా బల్క్ డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. తన డేట్స్ వేస్ట్ చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై రావు రమేష్ కాస్త అసహనంగా కూడా ఉన్నాడని తెలుస్తుంది. గతంలో తన సినిమాల్లో ఈయనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు మాటల మాంత్రికుడు. అయితే ఈసారి మాత్రం డేట్స్ మళ్లీ ఇవ్వడం కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రావు రమేష్ స్థానంలో అమృతం ఫేమ్ హర్షవర్ధన్‌ను తీసుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Related posts