telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొరటాలతో దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్

Jr.ntr actor Ycp photos social media

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. జులై నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాక ముందే ఎన్టీఆర్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొర‌టాల మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.

Related posts