telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనాకు కొత్త మందు…

corona vacccine covid-19

కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. ఈ త‌రుణంలో.. వ్యాక్సిన్ల గురించి కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి.. ఇక‌, ఆ మ‌ధ్యే క‌రోనా వైరస్​ ఉద్ధృతికి కళ్లెం వేసే యాంటీవైరల్​ ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. కోవిడ్ బాధితుడి నుంచి 24 గంటల్లోనే వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తేల్చారు.. అదే.. మోల్నుపిరావిర్​ అనే యాంటీవైరల్​ ఔషధం. జార్జియా స్టేట్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.. మోల్నుపిరావిర్​ అనే ఈ యాంటీ వైరల్​ ఔషధాన్ని తొలుత ఇన్​ఫ్లూయెంజా వైరస్​ల కోసం అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది.. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్​ఫెక్షన్లు కలిగించే ఆర్​ఎన్​ఏ వైరస్​లపై మోల్నుపిరావిర్​ సమర్థంగా పనిచేస్తుందని రుజువు చేశారు.. ఇన్​ఫెక్షన్​ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు.. వాటి నుంచి బయటకు వెలువడే వైరల్​ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్ర‌యోగాల్లో తేల్చారు.. దీంతో వైర‌స్ వ్యాప్తి త‌గ్గుతుందంటున్నారు.. మోల్నుపిరావిర్​ను కొవిడ్​ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించటం ఇదే మొద‌టిసారి కావ‌డం మ‌రో విశేషం.. కోవిడ్ చికిత్స‌లో ఇది మూడు రెట్లు ప్రయోజనంగా ఉంటుందంటున్నారు.

Related posts