telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : ముంబై కి షాక్ ఇచ్చిన పంజాబ్…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై కాప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక మొదట బ్యాఉయింగ్ చేసిన ముంబై లో క్వింటన్ డికాక్ (53) అర్ధశతకంతో రాణించగా.. క్రునాల్ పాండ్యా (34) అతనికి తోడుగా నిలిచాడు. దాంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక 177 ల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ బాట్స్మెన్ లలో తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ (77) అర్ధశతకంతో రాణించాడు. కానీ చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో 8 పరుగులే రావడంతో మ్యాచ్ టై అయ్యింది.

ఆ తర్వాత సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత ముంబై కూడా సూపర్ ఓవర్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ రెండో సూపర్ ఓవర్ లో మొదట బేటింగ్ చేసిన ముంబై 11 పరుగులు చేయగా పంజాబ్ తరపున మయాంక్, గేల్ బ్యాటింగ్ కు వచ్చారు. మొదటి బాల్ లోనే సిక్స్ బాదిన గేల్ తర్వాత బాల్ లో ఒక రన్ తీసాడు. ఇక తర్వాత స్ట్రైక్ కు వచ్చిన మయాంక్ రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో మూడో విజయం నమోదుచేసుకొని పిట్ల పట్టికలో 6 వ స్థానానికి వచ్చింది. అలాగే వరుస విజయాలతో ఉన్న ముంబై కి మూడో పరాజయాన్ని చూపించింది.

Related posts